మైలార్డ్, యువరానర్ అనొద్దు : ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

కోర్టులో విచారణ సమయంలో మైలార్డ్, యువరానర్, హానరబుల్ అనే పదాలను వినియోగించవద్దని.. కేవలం

Update: 2022-01-05 05:50 GMT

కోర్టులో విచారణ సమయంలో మైలార్డ్, యువరానర్, హానరబుల్ అనే పదాలను వినియోగించవద్దని.. కేవలం సర్ అని పిలిస్తే సరిపోతుందని ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ మురళీధర్ తెలిపారు. ఈ మేరకు న్యాయవాదులకు, వాదులకు, ప్రతివాదులకు ఆయన విజ్ఞప్తి చేశారు. మురళీధర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు బార్ అసోసియేషన్ కార్యదర్శి జేకే లంకా స్వాగతించారు. ఇకపై జడ్జీలు ఇదే సూత్రాన్ని అనుసరించాలని ఆయన సూచించారు.

బ్రిటీషు కాలం నాటి నుంచి వస్తున్న పదజాలం.. నేటికీ కోర్టుల్లో కంటిన్యూ అవుతూ వస్తోంది. మై లార్డ్ అనే పదం కూడా ఆ కాలానికి చెందిందే. అందుకే.. ఇకపై 'మై లార్డ్', 'యువర్ లార్డ్ షిప్', 'యువరానర్', లేక 'ఆనరబుల్' అనే పదాలను ఉపయోగించవద్దు అని సూచించారు. దీంతో జస్టిస్ ఎస్ మురళీధర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.



Tags:    

Similar News