బాలిక పొట్టలో 2 మీటర్ల వెంట్రుకల పోగు.. తీయడానికి శ్రమించిన వైద్యులు

జైపూర్‌కు చెందిన వైద్యులు ఓ బాలిక పొట్టలోని 210 సెంటీమీటర్ల పొడవైన వెంట్రుకల పోగును శస్త్రచికిత్సతో విజయవంతంగా తొలగించారు.

Update: 2025-06-01 12:01 GMT

జైపూర్‌కు చెందిన వైద్యులు ఓ బాలిక పొట్టలోని 210 సెంటీమీటర్ల పొడవైన వెంట్రుకల పోగును శస్త్రచికిత్సతో విజయవంతంగా తొలగించారు. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద వెంట్రుకల పోగుగా రికార్డుకెక్కింది. ఇప్పటి వరకు ఉన్న రికార్డు 180 సెంటీమీటర్లే. యూపీలోని ఆగ్రాకు చెందిన పదో తరగతి చదువుకునే 14 ఏళ్ల బాలిక నెల రోజులుగా వాంతులు, కడుపునొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. పరీక్షలు చేపట్టగా పొట్టలో గట్టి పదార్థం విస్తరించి ఉన్నట్లు గుర్తించారు.

గాస్రోటోమీ శస్త్రచికిత్సతో బయటపడిన భారీ వెంట్రుకల ఉండ పొట్టతో పాటు చిన్న పేగు భాగం వరకు విస్తరించి ఉందని వైద్యులు గుర్తించారు. ఇదంతా ఒకే భాగంగా ఉండటంతో ముక్కలుగా చేయాలంటే పేగు భాగానికి సైతం కోతలు పెట్టాల్సి ఉంటుంది. కానీ వైద్యులు ఎంతో సంక్లిష్టమైన ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. బాధిత బాలికకు ఆరో తరగతి నుంచే మట్టి, కర్ర ముక్కలు, చాక్‌పీస్‌ వంటివి తినే అలవాటు ఉండడంతో ఈ పరిస్థితి నెలకొందని వైద్యులు తెలిపారు.

Tags:    

Similar News