ఢిల్లీలో 300 మంది పోలీసులకు కరోనా

దేశ రాజధాని ఢిల్లీ కరోనా వైరస్ తో వణికిపోతుంది. ఎన్ని ఆంక్షలు పెట్టినా కేసుల పెరుగుదల ఆగడం లేదు.

Update: 2022-01-10 04:34 GMT

దేశ రాజధాని ఢిల్లీ కరోనా వైరస్ తో వణికిపోతుంది. ఎన్ని ఆంక్షలు పెట్టినా కేసుల పెరుగుదల ఆగడం లేదు. తాజాగా 300 మంది పోలీసులకు కరోనా సోకింది. ఢిల్లీ అదనపు పోలీస్ కమిషనర్ చిన్మయ్ బిశ్వాల్ కు కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో విధులు నిర్వహించే పోలీసులు సయితం బెంబెలెత్తి పోతున్నారు.

ఆంక్షలు విధించినా....
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సయితం కరోనా బారిన పడి కోలుకున్నారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీలో రాత్రి వేళ కర్ఫ్యూను కూడా విధించారు. అన్ని సినిమాహాళ్లను, మాల్స్ ను మూసివేశారు. వీకెండ్ కర్ఫ్యూను కూడా అమలు చేస్తున్నారు. అయినా కరోనా కేసులు ఆగడం లేదు. ప్రజలు స్వచ్ఛందంగా కోవిడ్ నిబంధనలను పాటిస్తే లాక్ డౌన్ అవసరం ఉండదని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.


Tags:    

Similar News