Breaking : అరవింద్ కేజ్రీవాల్‌కు షాకింగ్ న్యూస్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈడీ అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది

Update: 2024-03-21 11:59 GMT

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈడీ అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. తనను ఈడీ అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలంటూ అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ పేరుతో తనను పిలిచి అరెస్ట్ చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టేరేట్ అధికారులు చూస్తున్నారని ఆయన తన పిటీషన్ లో పేర్కొన్నారు.

తొమ్మిది సార్లు నోటీసులు...
దీంతో పదేపదే తనకు ఈడీ నోటీసులు ఇస్తుందని, తాను విచారణకు హాజరై సహకరిస్తారని, అయితే తనను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన వేసిన పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై విచారించిన హైకోర్టు ఈడీ అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వలేమని పేర్కొంది. దీంతో ఆయన దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌కు ఇప్పటి వరకూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తొమ్మిది సార్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టేరేట్ అధికారులు నోటీసులు ఇచ్చినా హాజరు కాలేదు.


Tags:    

Similar News