Big Breaking : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్.. కవితను అరెస్ట్ చేసిన టీం తోనే

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Update: 2024-03-21 15:43 GMT

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో కేజ్రీవాల్ ఇంటికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు చేరుకున్నారు. 12 మంది ఈడీ అధికారులు ఆయన ఇంటికి వచ్చి తనిఖీలు చేశారు. ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పిన తర్వాతఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేజ్రీవాల్ నివాసానికి రావడంతో ఆయనను అరెస్ట్ చేస్తారని ముందుగానే అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఆయనను అరెస్ట్ చేశారు. ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఎవరినీ లోపలికి అనుమతించలేదు. ఆమ్ ఆద్మీపార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చినా వారి ఎవరినీ లోపలకి అనుమతించలేదు. కేజ్రీవాల్ నుంచి స్టేట్‌‌మెంట్ రికార్డు చేశారు.

భారీగా పోలీసులు...
అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ సమయంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యగా 144 సెక్షన్ ను విధించారు. భారీగా కేంద్ర బలగాలు కేజ్రీవాల్ ఇంటి వద్ద మొహరించాయి. అక్కడకు వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు చేరుకుంటుండటంతో వారిని అదుపు చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. అరెస్ట్ చేసిన కేజ్రీవాల్ ను ఈడీ కార్యాలయానికి తరలిస్తున్నారు. ఆయనను రేపు కోర్టు ఎదుట హాజరుపర్చే అవకాశముంది. ఈరోజే హైకోర్టు తీర్పు రావడం, కవిత కస్టడీ ముగియనుండటంతో ఆయనను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. అందుకు తగినట్లుగానే ఆయనను అరెస్ట్ చేశారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టేరేట్ అధికారులు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారి జోగీందర్ నేతృత్వంలోనే అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి టీం వచ్చింది.


Tags:    

Similar News