మహారాష్ట్రలో భవనం కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
మహారాష్ట్రలో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. నిన్న విరార్ ప్రాంతంలో భవనం కూలి పదిహేను మంది మృతి చెందారు.
మహారాష్ట్రలో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. నిన్న విరార్ ప్రాంతంలో భవనం కూలి పదిహేను మంది మృతి చెందారు. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఇంకా ఇద్దరి ఆచూకీ లభించ లేదని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు . కొనసాగుతున్నాయి.
సహాయక చర్యలు...
పోలీసులు భవన యజమానిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. విరార్ లోని నారంగి ఫాటా దగ్గర ఉన్న రాము కాంపౌండ్ లో రమాబాయి అపార్ట్ మెంట్ లోని నాలుగో అంతస్థు కూలిపోయింది. వెనక భాగం కూలిపోవడంతో శిధిలాలు పక్కనే ఉన్న ఇళ్లపై పడ్డాయి. దీంతో పదిహేను మంది చనిపో్యినట్లు అధికారులు గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.