భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు

గడిచిన నెలరోజుల్లో రోజువారీ కేసుల సంఖ్య ఆరురెట్లు పెరిగినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఫిబ్రవరి 18న 112 కేసులు

Update: 2023-03-18 11:32 GMT

daily covid cases in india

కరోనా కథ ముగిసింది. ఇకపై మళ్లీ సాధారణ జీవితాలను గడపవచ్చు అనుకున్న ప్రతీసారీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. H3N2 కేసులు కలవరపెడుతున్న వేళ.. కరోనా కేసులు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో భారత్ లో 800 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం ప్రకటించింది. 126 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదైనట్లు తెలిపింది.

గడిచిన నెలరోజుల్లో రోజువారీ కేసుల సంఖ్య ఆరురెట్లు పెరిగినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఫిబ్రవరి 18న 112 కేసులు నమోదవ్వగా.. తాజాగా 841 కేసులు నమోదైనట్లు వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5,389కి చేరినట్లు తెలిపింది. అలాగే ఝార్ఖండ్ లో ఒకరు, మహారాష్ట్రలో ఒకరు కోవిడ్ లక్షణాలతో మరణించినట్లు పేర్కొంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నట్లు గుర్తించామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా.. నిన్న కేంద్రం ఆరు రాష్ట్రాలకు కోవిడ్ వ్యాపించకుండా చర్యలు చేపట్టాలని లేఖ రాసిన విషయం తెలిసిందే.


Tags:    

Similar News