Ditva Effect : తమిళనాడుపై విరుచుకుపడిన దిత్వా

దిత్వా తుపాను ప్రభావంతో తమిళనాడు రాష్ట్రం తీవ్రంగా ఇబ్బంది పడుతుంది.

Update: 2025-12-01 06:17 GMT

దిత్వా తుపాను ప్రభావంతో తమిళనాడు రాష్ట్రం తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. తమిళనాడులోని ఉరమ్‌, కడలూరు, రాణిపేట ప్రాంతాల్లో సోమవారం కూడా మోస్తరు వర్షం పడింది. తమిళనాడు–పుదుచ్చేరి తీరాలకు సమీపంలో తుపాను ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను లోతట్టు ద్రోణిగా బలహీనపడినట్టు ఐఎండి వివరించింది. మరింత బలహీనమై, వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వచ్చే 24 గంటలు ఇదే స్థితిలో నిలిచే అవకాశముందని తెలిపింది.లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి.

మెరీనాబీచ్ ను నేడు మూసివేత...
మెరీనాబీచ్ ను నేడు మూసివేశారు. దిత్వా తుపానులోతట్టు ద్రోణి బెంగాల్‌ ఖాతం దక్షిణ–పడమర భాగం, ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరి తీరాల వద్ద ఉత్తర దిశగా గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదిలింది. చెన్నైకి దక్షిణ–ఆగ్నేయ దిశలో 90 కి.మీ., పుదుచ్చేరివైపు తూర్పు–ఆగ్నేయ దిశలో 90 కి.మీ., కడలూరుకు తూర్పు–ఈశాన్య దిశలో 110 కి.మీ., కారైకాళ్‌కి ఈశాన్య దిశలో 180 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.ఈరోజు నాటికి మరింత బలహీనపడి సాధారణ ద్రోణిగా మారనుందని ఐఎండి చెప్పింది.


Tags:    

Similar News