పెరుగుతున్న కోవిడ్ కేసులు.. ప్రజల్లో ఆందోళన

కోవిడ్ కేసులు, H3N2 వైరస్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలకు సూచించింది. ఇన్‌ఫ్లుయెంజా తరహా అనారోగ్యం..

Update: 2023-03-12 04:39 GMT

increasing covid cases in india

దేశంలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఓ వైపు కోవిడ్, మరోవైపు H3N2 కేసులు పెరుగుండటంతో.. కేంద్రం అప్రమత్తమైంది. కోవిడ్ కేసులు, H3N2 వైరస్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలకు సూచించింది. ఇన్‌ఫ్లుయెంజా తరహా అనారోగ్యం, లేదంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్ కేసులుగా కనిపించే శ్వాసకోస సంబంధిత వ్యాధికారకాలపై సమగ్ర నిఘా కోసం కార్యాచరణ మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. అలాగే అన్ని ఆస్పత్రులలో మందులు, మెడికల్ ఆక్సిజన్, టీకాలను సిద్ధంగా ఉంచాలని తెలిపింది.

కొన్ని నెలలుగా దేశంలో అదుపులో ఉన్న కోవిడ్.. మళ్లీ చాపకిందనీరుగా విస్తరిస్తోంది. నిన్నటి కోవిడ్ అప్డేట్ లో ఆరోగ్య శాఖ 456 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపింది. ప్రస్తుతం కొత్త కేసులు, కొవిడ్ వ్యాప్తి అదుపులోనే ఉన్నా టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్ కు కట్టుబడి ఉండాలని పేర్కొంటూ.. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు.


Tags:    

Similar News