Corona Virus : గుజరాత్‌లో కరోనా విజృంభణ

గుజరాత్‌లో కరోనా విజృంభిస్తుంది. ఇరవై నాలుగు గంటల్లో 200 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయని వైద్యాధికారులు తెలిపారు

Update: 2025-06-12 02:49 GMT

గుజరాత్‌లో కరోనా విజృంభిస్తుంది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో గుజరాత్ లోనే రెండు వందల కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయని వైద్యాధికారులు తెలిపారు. ఇటీవల భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. అయితే కేరళ తర్వాత అత్యధికంగా గుజరాత్ లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఇది అందోళన కలిగిస్తుంది.

యాక్టివ్ కేసులు...
గుజరాత్‌లో ప్రస్తుతం 1,281కి చేరిన కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటికేవ భారత్‌లో 7 వేలు దాటిన కరోనా కేసులతో ప్రభుత్వాలు అప్రమత్తమయింది. గుజరాత్ ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది. ఖచ్చితంగా మాస్క్ లు ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు కోవిడ్ ప్రత్యేక వార్డులను కూడా ఏర్పాటు చేసింది.


Tags:    

Similar News