భారత్ లో బాగా తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు బాగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 2,503 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 27 మంది మరణించారు.
ఇండియా : భారత్ లో కరోనా కేసులు బాగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 2,503 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 27 మంది మరణించారు. మరణాల సంఖ్య కూడా చాలా రోజుల తర్వాత యాభైకి లోపు పడిపోయింది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,24,41,449 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 36,168 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 42,993,494 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,15,877 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 1,80,19,45,779 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు. భారత్ లో కరోనా రికవరీ రేటు 98.72 శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.20 శాతంగా ఉంది.