భారత్ లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా 30,757 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా 30,757 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు 541 మంది మరణించారు. మరణాల సంఖ్య కూడా పెరిగాయి. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,19,10,984 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
టెస్ట్ ల సంఖ్య....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 3,32,918 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,27,54,315 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,10,413 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 75,54,64,684 మందికి కరోనా పరీక్షలు చేశారు.