ఇరవై వేలకు దిగువన కేసులు... చాలా రోజుల తర్వాత
భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 19,968 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 19,968 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చాలా రోజుల తర్వాత ఇరవై వేలకు దిగువన కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్యమాత్రం నిన్నటికంటే పెరగడం ఆందోళన కల్గిస్తుంది. ఈరోజు 673 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,20,86,383 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
టెస్ట్ ల సంఖ్య....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 2,24,187 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,28,22,473 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,11,903 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 1,75,37,22,697 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు.