వామ్మో ఒక్కరోజులో ఇన్ని కేసులా?

భారత్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రతి రోజూ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.

Update: 2023-03-29 07:00 GMT

భారత్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రతి రోజూ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. గత 24 గంటల్లో 2,151 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు కరోనా కారణంగా మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

మృతుల సంఖ్య...
మృతుల సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. కోవిడ్ నిబంధనలను పాటించాలంటూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రస్తుతం దేశంలో 11,903 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఐదు నెలల్లో ఈరోజు అత్యధికంగా కేసులు నమోదయ్యాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Tags:    

Similar News