మళ్లీ పెరుగుతున్న కొవిడ్ కేసులు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనాతో ముగ్గురు మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది

Update: 2023-03-20 03:25 GMT

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇది ఆందోళన కలగించే అంశమే. గత కొద్ది రోజలుగా సాధారణ స్థాయికి వచ్చిన కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. కొత్తగా దేశంలో 1,071 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనాతో ముగ్గురు మరణించినట్లు కూడా పేర్కొంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

కోవిడ్ నిబంధనలను...
కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరింది. దేశంలో ఆరు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే తెలిపింది. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ రాష్ట్రాల్లో ప్రజలు కూడా ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని కోరింది. భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్‌లను విధిగా ధరించాలని కోరింది. నాలుగు నెలల తర్వాత దేశంలో వెయ్యి కేసులు నమోదవ్వడం ఆందోళన కల్గిస్తుంది. ప్రస్తుతం దేశంలో 5,915 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది.


Tags:    

Similar News