కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం

మేఘాలయ నూతన ముఖ్యమంత్రిగా కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం చేశారు

Update: 2023-03-07 07:26 GMT

మేఘాలయ నూతన ముఖ్యమంత్రిగా కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని షిల్లాంగ్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఫాగు చౌహాన్ సంగ్మా, మరియు మంత్రి వర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం పన్నెండు మంది మంత్రులతో సంగ్మా ప్రభుత్వం కొలువుదీరింది.

బీజీపీ నుంచి ఒకరు...
రెండోసారి ముఖ్యమంత్రిగా కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో పలువురు హాజరయ్యారు. మేఘాలయలో రెండు సీట్లు సాధించిన బీజేపీ సంగ్మా కేబినెట్ లో ఒక మంత్రిపదవిని దక్కించుకుంది. బీజేపీ నుంచి అలెగ్జాండర్ లలూ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.


Tags:    

Similar News