Renuka Choudhary : రేణుకా చౌదరిపై వేటు తప్పదా?
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేసే అవకాశముంది.
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేసే అవకాశముంది. ఈ మేరకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం రేణుకా చౌదరి పార్లమెంటుకు తన పెంపుడు కుక్కను తీసుకు వచ్చారు. అయితే ఈ కుక్క కరవదని, అరిచే కుక్కలు లోపల ఉన్నాయంటూ రేణుకా చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు...
దీంతో రేణుకా చౌదరికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. పార్లమెంటుకు కుక్కను తేవడమే కాకుండా వివాదస్పద వ్యాఖ్యలు చేయడాన్ని సీరియన్ గా తీసుకున్న ప్రభుత్వం ఈ మేరకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేసే యోచనలో ఉన్నారు. ఇప్పటికే నోటీసులు జారీ అయినట్లు తెలిసింది.