Delhi : సోనియాగాంధీకి కోర్టులో ఊరట

ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఊరట లభించింది.

Update: 2025-09-11 12:16 GMT

ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఊరట లభించింది. కాంగ్రెస్ నేత సోనియా గాంధీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు గురువారం కొట్టివేసింది. ఈ పిటిషన్‌లో, ఆమె భారతీయ పౌరురాలు కాకముందే మూడు సంవత్సరాలక్రితం పేరు ఓటర్ల జాబితాలో చేర్చాంటూ దాదాఖలైన పిటీషన్ పై విచారించిన కోర్టు ఈ పిటీషన్ ను కొట్టివేసింది. అదనపు ప్రధాన న్యాయమూర్తి వైభవ్ చౌరాసియా ఈ పిటిషన్‌ను తిరస్కరించారు.

భారత పౌరసత్వం పై...
ఈ నెల పదోతేదీన పిటీషనర్ వికాస్ త్రిపాఠి తరఫున వాదించిన సీనియర్ అడ్వకేట్ పవన్ నారంగ్, 1980 జనవరిలో సోనియా గాంధీ పేరు న్యూ ఢిల్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో చేర్చారని, ఆ సమయంలో ఆమె భారతీయ పౌరురాలు కాదని కోర్టులో వాదించారు. జాబితాలో చేర్చడంపై విచారణ జరపించాలని పిటీషనర్ తరుపున న్యాయవాది కోరారు. అయితే ఈ పిటీషన్ పై విచారణను నిలిపివేస్తూ కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది.


Tags:    

Similar News