ఆసుపత్రిలో చేరిన మల్లికార్జున ఖర్గే
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆసుపత్రిలో చేరారు
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆసుపత్రిలో చేరారు. ఆయన అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మల్లికార్జున ఖర్గే తీవ్ర జ్వరం, స్వల్ప శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. మల్లికార్జున ఖర్గేను బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అస్వస్థతకు గురి కావడంతో...
ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఖర్గే కుటుంబ సభ్యులు చెప్పారు. మల్లికార్జున ఖర్గే ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. త్వరగా కోలుకుని తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని మల్లికార్జున ఖర్గే కుటుంబ సభ్యులు తెలిపారు.