Sonia Gandhi : సోనియా గాంధీ హెల్త్ బులిటెన్ .. ఏం చెప్పారంటే?

కాంగ్రెస్ నేత సోనియా గాంధీ హెల్త్ బులిటెన్ ను గంగారాం ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు.

Update: 2025-06-16 07:47 GMT

సోనియా గాంధీ హెల్త్ బులిటెన్ ను గంగారాం ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. నిన్న రాత్రి గంగారాం ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీకి అన్ని రకాల పరీక్షలను నిర్వహించిన వైద్యులు ఉదర సంబంధిత సమస్యలు కొన్ని ఉన్నట్లు గుర్తించారు. సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగానే ఉందని గంగారాం ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

సిమ్లాలో అస్వస్థతకు గురయి...
సోనియా తన కుమార్తె ప్రియాంక గాంధీకి చెందిన సిమ్లాలోని నివాసంలో ఉన్న సమయంలో అస్వస్తతకు గురయ్యారు. అయితే వెంటనే ఆమెను అక్కడ ఆసుపత్రిలో చికిత్స చేయించి గంగారం ఆసుపత్రికి తీసుకు వచ్చారు. 78 ఏళ్ల వయసులో కొన్ని సమస్యలు సహజంగా వస్తాయని, ఆమెను ఇంకా ఆసుపత్రిలో కొద్దిరోజులు ఉంచి చికిత్స అందిస్తామని వైద్యులు తెలిపారు.


Tags:    

Similar News