Rahul Gandhi : నేటితో ముగియనున్న రాహుల్ గాంధీ యాత్ర
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్ర ఈరోజుతో ముగియనుంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్ర ఈరోజుతో ముగియనుంది. బీహార్ లో ఓట్ల సవరణ సందర్భంగా అవకతవకలు జరిగాయని, ఉన్న ఓట్లను తొలిగించారని కేంద్ర ఎన్నికల సంఘం పనితీరును తప్పుపడుతూ రాహుల్ గాంధీ బీహార్ లో ఓటర్ అధికార్ యాత్ర చేపట్టారు. దాదాపు పదహారు రోజుల పాటు ఓటు అధికార్ యాత్ర చేపట్టారు.
పదహారు రోజుల పాటు...
బీహార్ రాష్ట్రంలోని మొత్తం ఇరవై ఐదు జిల్లాల్లో నూట పది నియోజకవర్గాల నుంచి 1,300 కిలోమీటర్ల మేరకు రాహుల్ గాంధీ ఓటు అధికార్ యాత్ర కొనసాగింది. నేటితో యాత్ర ముగియనుంది. నేడు పాట్నాలో జరిగే బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. ఈ సభకు జాతీయ కాంగ్రెస్ నేతలతో పాటు బీహార్ కాంగ్రెస్ నేతలు పాల్గొననున్నారు.