Rahul Gandhi : బీహార్ లో కొనసాగుతున్న రాహుల్ యాత్ర
బీహార్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్ర కొనసాగుతుంది
బీహార్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్ర కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా బీహర్ లో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ ఓటు అధికార్ యాత్రను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పెద్దయెత్తున ఇండికూటమి నేతలు హాజరవుతున్నారు. బీహార్ లో తొలగించిన ఓట్లను తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చాలని రాహుల్ గాంధీ ఈ యాత్రను చేపట్టారు.
ఓటు అధికార్ యాత్ర....
సెప్టంబరు 1వ తేదీన ఈ యాత్ర పాట్నాలో ముగియనుంది. పాట్నాలో జరిగే బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. ఈరోజు ఓటు అధికార్ యాత్రలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీతో పాటు ఇండి కూటమి నేతలు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కూడా హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరై ఓటు అధికారయాత్రలో పాల్గొని తమ నిరసనను తెలియజేస్తున్నారు.