Rahul Gandhi : ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ
ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు
ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. ఆపరేషన్ సింూర్ తో పాటు కాల్పుల విరమణపై పార్లమెంటులో చర్చించడానికి వీలుగా వెంటనే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ప్రత్యేక సమావేవంలో ఆపరేషన్ సిందూర్ తో పాటు కాల్పుల విరమణ అంశంపై కూడా చర్చించాలని కోరారు. ఈ విషయాలపై ప్రజలకుచెప్పాల్సిన అవసరం ఉందని మోదీ అభిప్రాయపడ్డారు.
ట్రంప్ తొలుత ప్రకటించడంపై...
ప్రజా ప్రతినిధులకు కూడా ఈ విషయాలు గురించి చెప్పడాన్ని తాను కీలకంగా భావిస్తున్నానని తెలిపారు. కాల్పుల విరమణ అంశాన్ని తొలుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడాన్ని కూడా ప్రజల ముందు ఉంచాలన్న రాహుల్ గాంధీ, వీలయినంత తర్వగా పార్లమెంటు అత్యవసర సమావేశాలను ఏర్పాటు చేయాలని రాహుల్ గాంధీ రాసిన లేఖలో కోరారు.