ఎన్నికల సంఘంపై రాహుల్ సంచలన కామెంట్స్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-07-18 03:53 GMT

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ చోర్ శాఖగా అది మారిపోయిందని ఎక్స్ లో పోస్టు చేశారు. మహారాష్ట్రలో ఇలాగే కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరించిందని, ఇప్పుడు బీహార్ ఎన్నికల్లోనూ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ పేరుతో తొలగింపు చర్యలను చేపట్టిందని అన్నారు. ఉద్దేశపూర్వకంగానే కొన్ని ఓట్లను ఈసీ తొలగిస్తుందని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ జేబు సంస్థగా...
బీజేపీ జేబు సంస్థగా మారినకేంద్ర ఎన్నికల సంఘం అంటూ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. బీహార్ లో ఓట్లను దొంగిలిస్తూ బహిరంగంగా పట్టుపడిందని, దీనిని బహిర్గతం చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నారంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. జర్నలిస్టు అజిత్ అంజుమ్ దీనిపై పరిశోధించి ప్రసారం చేసిన దానిని ఆయన రీపోస్టు చేశారు. ఎస్ఐఆర్ పేరుతో ఎన్నికల సంఘం ఉద్దేశ్యపూర్వకంగా ఓటర్లను బీహార్ లో తొలగిస్తుందంటూ మండిపడ్డారు.


Tags:    

Similar News