Congress : కాంగ్రెస్ స్పెషల్ వెబ్ సైట్.. ఓట్ల చోరీపై
ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది.
ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి జవాబుదారీతనం కోరేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. డిజిటల్ ఓటరు జాబితా డిమాండ్‌తో వెబ్‌సైట్ ప్రారంభించినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. ప్రజలు తమ పేర్లు నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
కేంద్ర ఎన్నికల కమిషన్...
మరొకవైపు కేంద్ర ఎన్నికల కమిషన్ ను నేడు రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కానుంది. ఇందులో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలపై ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చే అవకాశముందని తెలిసింది. అయితే కాంగ్రెస్ మాత్రం అనేక రాష్ట్రాల్లో ఓట్లు చోరీకి గురయ్యాయని ఆరోపించడంతో పాటు ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుబంధంగా పనిచేస్తుందనని ఆరోపిస్తున్నారు.