Delhi : ఢిల్లీలో కాంగ్రెస్ కు ఘోర అవమానం

ఢిల్లీలో కాంగ్రెస్ కు ఘోర అవమానం ఎదురయింది. ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు

Update: 2025-02-08 08:22 GMT

ఢిల్లీలో కాంగ్రెస్ కు ఘోర అవమానం ఎదురయింది. ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానం కూడా దక్కలేదు. కేవలం ఆరున్నర శాతం మాత్రమే ఓట్లు సాధించింది. మూడోస్థానానికే అన్నిచోట్ల పరిమితమయింది. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు.

మూడు సార్ల నుంచి...
మూడు సార్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరో మూడు సార్లు అధికారానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అభ్యర్థులు కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి కూడా కనిపించలేదు. ఇంత దారుణమైన పరిస్థితిని కాంగ్రెస్ గతంలో ఎన్నడూ చూడలేదు. ఢిల్లీ ఎన్నికల్లో తొలి నుంచి కాంగ్రెస్ పార్టీ చివరకు ప్రచారంలోనూ మూడో స్థానంలో ఉంది.


Tags:    

Similar News