హోలీ పండుగ తేదీ మారుతుందా?

ఈ ఏడాది హోలీ పండగ తేదీపై దేశవ్యాప్తంగా గందరగోళం ఏర్పడింది.

Update: 2026-02-08 02:46 GMT

ఈ ఏడాది హోలీ పండగ తేదీపై దేశవ్యాప్తంగా గందరగోళం ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం కారణంగా, కామ దహనం, హోలీ తేదీల విషయంలో భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చంద్రగ్రహణం మరియు సూతక కాలం కారణంగా మార్చి 3వ తేదీన రంగుల పండుగ నిర్వహించడం శాస్త్రపరంగా సముచితం కాదని పండితులు చెబుతున్నారు.

మార్చి 4న జరుపుకోవాలని...
అందుకే దేశవ్యాప్తంగా మార్చి 4, 2026 న హోలీ జరుపుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం మూడో తేదీన హోలీ జరుపుకుంటే తప్పులేదని వాదిస్తున్నారు. వచ్చే నెల 3వ తేదీన హోలీ పండగ అని క్యాలెండర్ లో ఉండటంతో ఈ మీమాసం ఎదురయింది. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా ఏలాంటి నిర్ణయం తీసుకోలేదు.


Tags:    

Similar News