ఈడీ మరింత పవర్ ఫుల్.. కేంద్రం కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మోదీ సర్కార్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విషయంలో ఇంకో అడుగు ముందుకు వేసింది

Update: 2022-12-01 07:38 GMT

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మోదీ సర్కార్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విషయంలో ఇంకో అడుగు ముందుకు వేసింది. మనీలాండరింగ్ చట్టంలో కొన్ని మార్పులు చేయడంతో పాటు పీఎంఎల్ఏ చట్టంలోని 66వ నిబంధనలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరో 15 సంస్థలను ఈడీ పరిధిలోకి తెస్తూ చట్టంలో మార్పులు చేసింది.

రాష్ట్ర పోలీసుల విభాగాలను
రాష్ట్ర పోలీసుల విభాగాలను కూడా ఈడీ పరిధిలోకి తెచ్చింది. ఏ సమాచారం కావాలన్న పలీసులు సహకరించేలా నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ను మరింత శక్తిమంతమైనదిగా తీర్చిదిద్దేందుకు ఈ సవరణలను కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. మరోవైపు రాష్ట్రాలపై ఈడీలను మరింత బలంగా ప్రయోగించేందుకే ఈ నిర్ణయం తీసుకుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.


Tags:    

Similar News