కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

వాహనతయారీదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది.

Update: 2025-06-28 04:22 GMT

వాహనతయారీదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసిన వారికి విధిగా రెండు హెల్మెట్లు ఇవ్వాలని నిబంధన పెట్టింది. ఈ నిబంధన ఇప్పుడు కొత్తగా విక్రయించే ప్రతి ద్విచక్రవాహనానికి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. వినియోగదారులు కూడా కొనుగోలు దారుల నుంచి రెండు హెల్మెట్లను డిమాండ్ చేయాలని తెలిపింది.

బైక్ కొన్నవారికి...
బైక్‌ కొన్నవారికి తప్పనిసరిగా రెండు హెల్మెట్లు ఇవ్వాలని, ఐఎస్ఐ నిబంధనలతో తయారుచేసిన హెల్మెట్లనే బైక్‌తో పాటు యజమానికి అందించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మూడుచక్రాల వాహనాలకు యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉండేలా చూడాలని తెలిపింది. సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్రం ముసాయిదా విడుదల చేసింది. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.


Tags:    

Similar News