రైల్వేలో ఉద్యోగమా.. మాజాకా.. దీపావళి బోనస్ ఒక్కొక్కరికి ఇంత వస్తుందా?
కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే ఉద్యోగులకు దీపావళి బోనస్ ను ప్రకటిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే ఉద్యోగులకు దీపావళి బోనస్ ను ప్రకటిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మొత్తం 1866 కోట్ల రూపాయలు బోనస్ గా చెల్లించనుంది. 78 రూపాయల వేతనాన్ని దీపావళి బోనస్ గా చెల్లించనుంది. దీంతో మొత్తం 10.61 లక్షల మంది రైల్వే ఉద్యోగులు బోనస్ అందుకోనున్నారు. దీంతో పాటు కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రధానంగా బీహార్ ఎన్నికల సమయంలో ఆ రాష్ట్రానికి వరాలను ప్రకటించింది.
మొత్తం 95 వేల కోట్ల రూపాయలు...
మొత్తం 95 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో బీహఆర్ లో ఆరువేల కోట్ల విలువైన రహదారి అభివృద్ది ప్రాజెక్టులకు ఓకే చెప్పింది. అలాతే దేశ వ్యాప్తంగా వైద్య విద్య సీట్ల పెంపునకు కూడా ఆమోద ముద్ర వేసింది. బీహార్ లో 2,192 కోట్ల రూపాయలతో భక్తియార్ పుర్ -రాజ్ గిర్ -తిలయ్యా డబ్లింగ్ పనులకు ఆమోదం తెలిపింది. అలాగే సాహెబ్ గంజ్- ఆరెరాజ్ - బెతియా మధ్య 3,822 కోట్లతో నాలుగు వరసల జాతీయ రహదారికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.