అమర్‌నాథ్ యాత్రపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
అమర్‌నాథ్ యాత్రపై కేంద్రప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
అమర్‌నాథ్ యాత్రపై కేంద్రప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పహాల్గామ్ దాడి ఘటనల నేపథ్యంలో అమర్ నాధ్ యాత్రపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది అందరిలోనూ ఉత్కంఠగా మారింది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం అమర్ నాధ్ యాత్ర యధాతధంగా కొనసాగుతుందని, రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులను అనుమతిస్తుందని తెలిపింది.
జులై 3వ తేదీ నుంచి...
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో జూలై 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్రపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. యాత్ర సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. కాశ్మీర్ పర్యాటక కేంద్రంగా తిరిగి అభివృద్ధి చెందుతుందని, ఎవరు కాశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోలేరని పేర్కొన్నారు. అలాగే ఉగ్రవాదులను ఆశ్రయించే వారిని గుర్తించి శిక్షిస్తామని చెప్పారు.