నాలుగో వేవ్ నేపథ్యంలో కేంద్రం అలెర్ట్
భారత్ లో నాలుగో వేవ్ కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్న అంచనాతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది
భారత్ లో నాలుగో వేవ్ కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్న అంచనాతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. మూడో వేవ్ ముగిసిందనుకుంటున్న తరుణంలో నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. చైనా, ఆగ్నేయ ఆసియా, ఐరోపా దేశాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తుంది. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమయింది.
రాష్ట్రాలకు ఆదేశాలు...
దీంతో రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. మాస్క్ లు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. టెస్ట్ ల సంఖ్యను కూడా పెంచాలని కూడా సూచించింది. అందరికీ వ్యాక్సినేషన్ అందేలా చూడాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది.