8 యూట్యూబ్ చానళ్లపై నిషేధం

ఎనిమిది యూట్యూబ్ చానళ్ల పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది

Update: 2022-08-18 08:14 GMT

ఎనిమిది యూట్యూబ్ చానళ్ల పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఫేక్ వార్తలను ప్రసారం చేస్తున్న ఈ ఛానళ్లను నిషేధిస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులో ఏడు యూట్యూబ్ ఛానెళ్లు భారత్ కు చెందినవి కాగా, ఒకటి పాకిస్థాన్ కు చెందింది. ఈ ఎనిమిది ఛానళ్లను బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ చానళ్లకు మొత్తం 85 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నట్లుగా గుర్తించింది.

ఫేక్ వార్తలను...
వీటి ద్వారా ప్రసారమయిన వీడియోలను 114 కోట్ల మంది వీక్షించారు. ఫేక్ వార్తలను అడ్డుకునేందుకు ఈ ఛానళ్లను నిషేధించినట్లు తెలిపింది. భారత సాయుధ బలగాలతో పాటు, జమ్మూకాశ్మీర్ కు వ్యతిరేకంగా ఈ ఛానళ్లు పలు కథనాలను ప్రసారం చేసినట్లు గుర్తించారు. దీంతో ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం 102 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసినట్లయింది.


Tags:    

Similar News