గ్యాస్ సిలిండర్‌పై రూ.111 పెంపు
కొత్త ఏడాది తొలిరోజే కేంద్రం భారీ షాక్ ఇచ్చింది.
కొత్త ఏడాది తొలిరోజే కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండర్ ధరను ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఏకంగా 111 రూపాయలు పెంచేశాయి. గురువారం నుంచి కొత్త ధర అమల్లోకి వచ్చింది. గత ఏడాది జూన్ తర్వాత ఇంత భారీస్థాయిలో వాణిజ్య సిలిండర్ ధర పెరగడం ఇదే మొదటిసారి.
వాణిజ్య సిలిండర్ ధరపై...
అయితే 14.2 కిలోల గృహోపయోగ వంటగ్యాస్ ధరలో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. గడచిన రెండు నెలల కాలంలో రెండు సార్లు వాణిజ్య ఎల్‌పీజీ ధరను చమురు కంపెనీలు తగ్గించాయి. ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్లు, పెట్రో ఉత్పత్తులపై చమురు కంపెనీలు సమీక్ష చేస్తుంటాయి. అందులో భాగంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.