కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది
central election commission
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో రిగ్గింగ్ జరిగిందంటూ లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ప్రధాన నేత రాహుల్ గాంధీతో పాటు అనేక మంది రాజకీయ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఆరోపణలు రావడంతో...
2024 లోక్ సభ ఎన్నికలతో పాటు అనేక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల పై రాహుల్ గాంధీతోపాటు ఇండియా కుటమిలోని అన్ని పార్టీలు ఎన్నికల కమిషన్ పై ఈ ఆరోపణలు చేస్తున్నాయి. అయితే తొలుత ఈ ఆరోపణలను ఖండించిన ఎన్నికల సంఘం ప్రస్తుతం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర సహ పలు రాష్ట్రాల్లో జరిగిన పోలింగ్ లోని ఓటరు రోలింగ్ నెంబర్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. దీంతో ఓటింగ్ కు సంబంధించి, ఓటింగ్ శాతానికి సంబంధించి పారదర్శకంగా వ్యవహరిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ తెలిపింది.