Cabent Meet : నేడు సీసీఎస్ కేబినెట్ భేటీ
నేడు సీసీఎస్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. మోదీ నివాసంలో జరగనున్న సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు
నేడు సీసీఎస్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. పహాల్గామ్ లో ఉగ్రవాదుల దాడికి ఇరవై ఆరు మంది అమాయాకులు బలయిన ఘటనలో ఆపరేషన్ సిందూర్ ను కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే నేడు ప్రధాని మోదీ నివాసంలో సీసీఎస్ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ఆపరేషన్ సిందూర్ తో పాటు పాకిస్తాన్ అణ్యాయుధాల బెదిరింపులకు వ్యతిరేకంగా ఈ సమావేశం లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. అదే సమయంలో పాక్ పై ఆర్థిక ఆంక్షలు, తదుపరి సైనిక చర్యలకు సంబంధించి చర్చించే ఛాన్స్ ఉంది.
భవిష్యత్ లో జరిగే చర్చల్లో....
దీంతో పాటు పాక్ తో భవిష్యత్ లో జరిగే చర్చల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటు ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాలపై ఫోకస్ పెట్టాలని మోదీ కేబినెట్ సహచరులకు తెలియజేసే అవకాశముంది. ఈ సమావేశంలో సీనియర్ మంత్రులతో పాటు జాతీయ భద్రతాదాధికారులు పాల్గొంటారు. ప్రపంచ దేశాల ముందు పాక్ ను దోషి గా పెట్టేందుకు భారత్ తన ప్రయత్నాలను కొనసాగించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. దీంతో పాటు ఆపరేషన్ సిందూర్ సక్సెస్ చేసినందుకు సైన్యానికి అభినందనలు తెలపనుంది.