Narendra Modi : నేడు ఇజ్రాయెల్ పర్యటనకు ప్రధాని మోదీ
నేడు ఇజ్రాయెల్ పర్యటనకు ప్రధాని మోదీ బయలుదేరి వెళ్లారు
నేడు ఇజ్రాయెల్ పర్యటనకు ప్రధాని మోదీ బయలుదేరి వెళ్లారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మోదీ భేటీకానున్నారు. ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రసంగించనున్న మోదీ ప్రసంగించనున్నారు. ఇరు దేశాల మధ్య ఒప్పందాలు చేసుకునే అవకాశముంది. 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇజ్రాయిల్ లో పర్యటించి పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు.
ఇరుదేశాల మధ్య...
తిరిగి ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీకి ఈ అరుదైన అవకాశం దక్కింది. ఇజ్రాయిల్ అధ్యక్షుడు ఐజాగ్ హెర్జోగ్ ను కూడా ప్రధాని మోదీ కలిసి ఇరు దేశాల సంబంధాలపై చర్చించనున్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపడేలా ప్రధాని నరేంద్ర మోదీ ఈ పర్యటనలో ఒప్పందాలు చేసుకోన్నారు. మోదీ పర్యటనతో ఇరు దేశాల సంబంధాలు మరింత బలపడనున్నాయి.