నేడు కేంద్ర కేబినెట్ సమావేశం

నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది

Update: 2026-02-24 04:32 GMT

నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. నేడు సేవాతీర్థ్‌లో తొలిసారి కేంద్రకేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.

కీలక అంశాలపై...
అలాగే కీలక విషయాలను ఆమోదించనున్నారు. అమెరికా - భారత్ , భారత్ - బ్రెజిల్ ఒప్పందాలతో పాటు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం రాష్ట్రాలకు సంబంధించిన అభివృద్ధి పనులకు సంబంధించిన కీలక నిర్ణయాలను మంత్రి వర్గ సమావేశం తీసుకునే అవకాశముందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఉద్యోగులు, రైతులకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించనుంది.


Tags:    

Similar News