హోలీ ఎప్పుడు?.. మార్చి 3 లేక 4వ తేదీనా?

ఈ ఏడాది హోలీ పండుగ తేదీల పై నెలకొన్న గందరగోళానికి డ్రిక్ పంచాంగం తెరదించింది.

Update: 2026-02-24 03:09 GMT

ఈ ఏడాది హోలీ పండుగ తేదీల పై నెలకొన్న గందరగోళానికి డ్రిక్ పంచాంగం తెరదించింది. హోలికా దహన్ మార్చి 3న, రంగుల పండుగ హోలీ మార్చి 4న జరుపుకోవాలని పండితులు పేర్కొన్నారు. మార్చి 2వ తేదీ సాయంత్రం 5:55 గంటలకు ప్రారంభమయ్యే పూర్ణిమ తిథి, మార్చి 3వ తేదీ సాయంత్రం 5:07 గంటలకు ముగుస్తుంది.

శాస్త్రం ప్రకారం...
శాస్త్రం ప్రకారం పౌర్ణమి ఉన్న రోజు సాయంత్రం హోలికా దహన్ నిర్వహించి, మరుసటి రోజు రంగులతో హోలీ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. హోలీకి ముందు రోజు జరిగే కామ దహనం మార్చి 3వ తేదీన జరుపుకోవాలని, నాలుగో తేదీన హోలీ పండుగను చేసుకోవాలని నిర్ణయించార. తిథులను బట్టి దీనిని పండితులు నిర్ణయించారు.


Tags:    

Similar News