మార్చి 1 నుంచి అందుబాటులోకి "రైల్ వన్" యాప్
భారతీయ రైల్వేశాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది.
భారతీయ రైల్వేశాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 1 నుంచి అందుబాటులోకి "రైల్ వన్" యాప్ అమలులోకి రానుంది. భారతీయ రైల్వే శాఖ రైల్ వన్ యాప్ ను అమలులోకి తీసుకు రానుంది. దీనివల్ల ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు వీలు కలుగుతుందని భారతీయ రైల్వే శాఖ అధికారులు తెలిపారు. అన్ని విషయాల్లో ఈ యాప్ అనుకూలంగా ఉంటుందని చెప్పారు.
మార్చి ఒకటో తేదీ నుంచి...
భారతీయ రైల్వే శాఖ ఈ ఏడాది మార్చి 1వ తేదీన నుంచి UTS మొబైల్ యాప్ ను మూసివేసి, దానిని కొత్త రైల్ వన్ యాప్ తో భర్తీ చేయనుంది. దీనిద్వారా అన్ని టికెట్-బుకింగ్ సర్వీసులు ఒకే వేదిక కిందకు వస్తాయి. రైల్ వన్ యాప్ ద్వారా టిక్కెట్ల రిజర్వేషన్, అన్ రిజర్వ్ టికెటింగ్, లైవ్ ట్రైన్ స్టేటస్, జర్నీ ప్లానింగ్, డిజిటల్ చెల్లింపులకు ఇది మద్దతుగా నిలుస్తుంది. వినియోగదారులకు సజావుగా, ఏకీకృత ప్రయాణ బుకింగ్ అనుభవాన్ని అందిస్తుంది.