Haryana : హర్యానాలో కారు బీభత్సం

హర్యానాలో కారు బీభత్సం సృష్టించింది. మైనర్లు ఇద్దరు కారును డ్రైవింగ్ చేసుకుంటూ ఇరుకు వీధుల్లోకి రావడంతో భయంతో పిల్లలు, పెద్దలు పరుగులు తీశారు

Update: 2025-07-21 04:09 GMT

హర్యానాలో కారు బీభత్సం సృష్టించింది. మైనర్లు ఇద్దరు కారును డ్రైవింగ్ చేసుకుంటూ ఇరుకు వీధుల్లోకి రావడంతో భయంతో పిల్లలు, పెద్దలు పరుగులు తీశారు. ఇద్దరు మైనర్లు ఎస్.యూ.వి కారును డ్రైవింగ్ చేసుకుంటూ ఇరుకు సందుల్లోకి వచ్చారు. అయితే వారికి డ్రైవింగ్ తెలియక ఇష్టం వచ్చినట్లు నడపడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

మైనర్లు నడిపి...
కొందరు పిల్లలు దూసుకు వస్తున్న కారు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ కారు అనేక వాహనాలను ఢీకొట్టింది. వాహనాలన్నీ ధ్వంసమయి ఒక చోట ఆగిపోవడంతో అందులో ఇద్దరు మైనర్లు ఉండటం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పిల్లలకు కారు ఇచ్చిన తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేయాలని స్థానికులు కోరుతున్నారు.


Tags:    

Similar News