Delhi : ఢిల్లీ లో మారోసారి బాంబు బెదిరింపులు కలకలం

ఢిల్లీ లో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి.

Update: 2025-11-18 06:47 GMT

ఢిల్లీ లో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. పాటియాలా, సాకేత్ కోర్టుల్లో బాంబులు పెట్టినట్లు ఈ మెయిల్స్ ద్వారా సమాచారం అందిందింది. దీంతో న్యాయస్థానం నుంచి అందరినీ బయటకు పంపించి వేశారు. బాంబు స్క్కాడ్ తో తనిఖీలు చేపడుతున్నారు. తనిఖీలు చేసిన అనంతరమే న్యాయవాదులతో పాటు కక్షిదారులను లోపలికి అనుమతిస్తామని తెలిపారు.

విద్యాసంస్థలకు...
మరొకవైపు ఢిల్లీలోని కొన్ని విద్యాసంస్థలకు కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో అన్ని చోట్ల అధికారులు తనిఖీలు చేస్తున్నారు. బాంబులు లేవని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే విద్యాసంస్థల్లోకి అనుమతిస్తున్నారు. ఇటీవల ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు మరవక ముందే ఈరోజు వచ్చిన బాంబు బెదిరింపులు కలకలం రేపాయి


Tags:    

Similar News