నేడు సైఫ్ ఆలీఖాన్ డిశ్చార్జ్
బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు.
బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. లీలావతి ఆసుపత్రి వైద్యుల సూచన మేరకు సైఫ్ ఆలీఖాన్ కొద్దిరోజుల పాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోనున్నారు. ఉదయం పది గంటలకు సైఫ్ ఆలీఖాన్ డిశ్చార్జ్ అవుతారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇటీవల సైఫ్ ఆలీఖాన్ ఇంట్లో దొంగతనానికి వచ్చిన వ్యక్తిని అడ్డుకోబోయిన ఆయనపై కత్తిపోట్లతో దాడికి దిగిన సంగతి తెలిసిందే.
దాడిలో గాయపడి...
ఈదాడిలో సైఫ్ ఆలీఖాన్ తీవ్రంగా గాయపడి లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆయనకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. వెన్నుముక పక్కన కత్తి బలంగా దిగబడటంతో సైఫ్ ఆలీఖాన్ ను కుటుంబ సభ్యులు ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు సైఫ్ ఆలీఖాన్ పై దాడి చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.