సైఫ్ ఆలీఖాన్ వారం రోజులు కదలకూడదు.. వైద్యుల సూచన

బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి ఇంటికి చేరుకున్నారు

Update: 2025-01-21 12:28 GMT

ఆసుపత్రి నుంచి సైఫ్‌ అలీఖాన్‌ డిశ్చార్జ్ అయ్యారు. కొద్ది సేపటి క్రితం సైఫ్ ఆలీఖాన్ లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి ఇంటికి చేరుకున్నారు. ఈ నెల 16న కత్తిదుండగుడి దాడిలో కత్తిపోట్లకు గురైన సైఫ్‌ అలీఖాన్‌ ఐదు రోజులు పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆయన వెన్నుముక సమీపంలో కత్తి బలంగా దిగడంతో దానికి సర్జరీ చేశారు. కేవలం నాలుగు రోజుల్లోనే సైఫ్ ఆలీఖాన్ కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

డిశ్చార్జ్ కావడంతో...
అయితే వారం రోజుల పాటు సైఫ్ ఆలీఖాన్ పూర్తిగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని లీలావతి వైద్యులు సూచించారు. అలాగే ఆయనను పరామర్శించేందుకు కూడా ఎక్కువ మంది రాకపోవడమే మంచిదని, ఇన్ ఫెక్షన్లు సోకే అవకాశముందని కూడా వైద్యులు హెచ్చరించారు. దుండగుడి దాడితో సైఫ్ ఆలీఖాన్ ఇంటివద్దభద్రతను పెంచారు.


Tags:    

Similar News