ప్రమాదం పై స్వామి కాంట్రవర్సీ కామెంట్స్
హెలికాప్టర్ ప్రమాదంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు
హెలికాప్టర్ ప్రమాదంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రమాద ఘటనపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రమాద ఘటన దేశ భద్రతలకు పెద్ద హెచ్చరికగా సుబ్రహ్మణ్య స్వామి అభివర్ణించారు. చీఫ్ ఆఫ్ ఆర్మీ బిపిన్ రావత్ తో సహా 13 మంది మరణించడం షాకింగ్ అని ాయన అన్నారు.
అనుమానాలు....
హెలికాప్టర్ ప్రమాద ఘటనపై ఇంకా విచారణ జరుగుతుందని, తుది నివేదిక అందేంత వరకూ ఏదైనా చెప్పడం కష్టమేనని సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయపడ్డారు. తమిళనాడు లాంటి రక్షిత ప్రదేశంలో హెలికాప్టర్ కూలిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని, దీనిపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చేత విచారణ జరిపించి నిజాలను నిగ్గు తేల్చాలని ఆయన కోరారు.