BJP : నేడు బీజేపీ మహిళ మోర్చా నిరసనలు

రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ తల్లిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా చేపట్టాలని బీజేపీ మహిళ మోర్చా పిలుపునిచ్చింది.

Update: 2025-09-01 03:53 GMT

భారతీయ జనతా పార్టీ నేడు దేశ వ్యాప్తంగా నిరసనలు తెలియజేయనున్నాయి. బీజేపీ మహిళమోర్చా ఆధ్వర్యంలో ఆందోళనలకు పిలుపు నిచ్చింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ తల్లిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా చేపట్టాలని బీజేపీ మహిళ మోర్చా పిలుపునిచ్చింది.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా...
దేశవ్యాప్తంగా మహిళా మోర్చా నేతలు నేడు నిరసన తెలియజేయనున్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో బీజేపీ నేతలు కూడా పాల్గొననున్నారు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేయనున్నారు. రాహుల్ వ్యాఖ్యలకు నిరసనగా నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ బీజేపీ మహిళ మోర్చా నిరసనలు తెలియ చేయనుంది.


Tags:    

Similar News