నేడు బీహార్ శాసనసభ పక్ష సమావేశం
నేడు బిహార్ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది
నేడు బిహార్ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. ఇటీవల జరిగిన బీహర్ ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎంత మంది మంత్రులను కేబినెట్ లోకి తీసుకోవాలన్న దానిపై కూడా చర్చ జరగనుంది.
ఈ నెల 20వ తేదీన...
ఈ నెల 20వ తేదీన నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే గవర్నర్ ను కలిసి తన రాజీనామాను ఆమోదించాలని నితీష్ కుమార్ కోరారు. బీజేపీ శాసనసభ పక్షం ముగిసిన తర్వాత ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కూటమి తరపున సీఎంగా నితీష్ కుమార్ ను శాసనసభ్యులు ఎన్నుకోనున్నారు.