Kerala : కేరళ కుంభమేళా కు వెళ్లాలంటే?
కేరళలో ఈ ఏడాది అతిపెద్ద కుంభమేళా జరగనుంది.
కేరళలో ఈ ఏడాది అతిపెద్ద కుంభమేళా జరగనుంది. సుమారు 271 సంవత్సరాల తర్వాత ఈ కుంభమేళా జరుగనుంది. కేరళలోని తిరునవాయలో ఉన్న నీలానది మహా మాఘ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.దీనిని కేరళ కుంభమేళాగా పిలుచుకుంటారు. కేరళలోని తిరునవాయలో ఇక్కడ చివరిసారిగా 1755లో మాఘ మహోత్సవం జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. 2016లో ఇక్కడ పుణ్య స్నానాలు ప్రారంభమయ్యాయి.
271 ఏళ్ల తర్వాత...
ఈ ఏడాది కుంభమేళా జరుగుతోంది. స్వామి ఆనందవరం భారతి, స్వామి అభినవ బాలానంద భైరవ్ ఆధ్వర్యంలో ఈ మహోత్సవం జరుగుతోంది. ఈ ఉత్సవానికి దేశం నలుమూలల నుంచి ఆధ్మాత్మిక గురువులు, భక్తులు హాజరవుతున్నారు. నీలా హారతిని నిర్వహించడానికి వారణాసి నుంచి నిపుణులు వస్తున్నారు. పుణ్య స్నానం, యతిపూజలను ఇక్కడ నిర్వహించనున్నారు. ఈ నెల 22వ తేదీన గణేశ్ జయంతి, 23వ తేదీన వసంత పంచమి , 25న రథ సప్తమి, 26 న భాష్మ అష్టమి, ఫిబ్రవరి 1న మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 3న మాఘ మాకం సమయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి.