జమ్మూ కాశ్మీర్ లో భద్రతా దళాలు–ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్
జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో భద్రతా దళాలు–ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది
జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో భద్రతా దళాలు–ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. మారుమూల అటవీ ప్రాంతమైన సింగ్‌పూర్‌లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో దళాలు ప్రతీకార కాల్పులు జరిపాయి. చత్రు ప్రాంతంలోని మాండ్రాల్–సింఘురా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ముగ్గురు ఉగ్రవాదులున్నట్లు...
ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నట్లు నిఘా సమాచారం అందింది. వారు జైష్-ఎ-మొహమ్మద్‌కు చెందినవారై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదులు దేశంలోకి చొరబడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్నిప్రాంతాల్లో పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా నేడు కిష్త్వార్ జిల్లాలో ఉగ్రవాదులున్నట్లు గుర్తించిన భద్రతాదళాలు వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.