Tamilnadu : అసెంబ్లీ సమావేశాల నుంచి వెళ్లిపోయిన గవర్నర్
తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి
తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయిన కొద్దిసేపటికే గవర్నర్ ఆర్.ఎన్. రవి సమావేశాల నుంచి వెళ్లి పోయారు. తమిళనాడు శాసనసభ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి తొలిరోజు గవర్నర్ ఆర్ఎస్ రవి ప్రసంగించాల్సి ఉంది.
జాతీయ గీతానికి...
అయితే జాతీయ గీతానికి సరైన గౌరవం ఇవ్వలేదంటూ అసెంబ్లీ నుంచి అకస్మాత్తుగా గవర్నర్ ఆర్ఎస్ రవి వెళ్లిపోయారు. దీంతో సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభం కానున్నాయి. గతంలోనూ గవర్నర్ ఆర్ఎస్ రవి సభ నుంచి వెళ్లిపోయారని, ఇది ఆయనకు కొత్తేమీ కాదని డీఎంకే నేతలు చెబుతున్నారు.